Amaravati: అమరావతిలో మళ్లీ వరద ముంపు?- తేల్చేసిన ఏపీ సర్కార్..!

ఏపీని గత వారం రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు వణికించాయి. ఈ రెండు తుఫాన్ల ధాటికి భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇంకా తుఫాన్ల నుంచి జనం కోలుకోవడం లేదు. అయితే ఇలా తుఫాన్ల కారణంగా అమరావతి రాజధానిలోని (Amaravati Capital) పలు ప్రాంతాలు కూడా నీళ్లలో ఉన్నాయి. దీంతో అమరావతిలో ముంపు మరోసారి తెరపైకి వచ్చింది. రాజధాని ముంపు ప్రాంతంలో ఉందన్న వాదనను వైసీపీ కూడా తెరపైకి తెస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇవాళ స్పందించింది.

AP Poll Counting: ఏపీ ఉద్యోగుల తీర్పు ఇదే..! పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో క్లారిటీ..!
AP Poll Counting: ఏపీ ఉద్యోగుల తీర్పు ఇదే..! పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో క్లారిటీ..!

భారీ వర్షాల కారణంగా అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పరిసరాలు, రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, రాజధాని ప్రాంతమంతా వరదతో మునిగిపోయిందని కొన్ని వార్తా చానల్స్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో తెలిపింది. అయితే అర్నబ్, మురుసు తుఫాన్ ల కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో తీసిన గోతులలో, చేసిన తవ్వకాలలో నీరు చేరిన మాట వాస్తవమేనని అంగీకరించింది.

ap govt clarified to claims of Amaravati capital region being flooded after two cyclones
జగన్ కోటను కూల్చిన టీడీపీ..! ప్రతీకారం తీర్చుకున్న చంద్రబాబు..!
జగన్ కోటను కూల్చిన టీడీపీ..! ప్రతీకారం తీర్చుకున్న చంద్రబాబు..!

అమరావతి పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ప్రస్తుతం డ్రైనేజీ, డక్టింగ్ , అండర్ గ్రౌండ్ పనుల కోసం పెద్ద ఎత్తున గోతులు తవ్వినట్లు ప్రభుత్వం తెలిపింది. నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న వేళ, వర్షం నీరు నిర్మాణ పనుల గోతుల్లో నిలవడం సహజమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిని ఆధారంగా చేసుకుని "రాజధాని అంతా మునిగిపోయింది", "వరద బీభత్సం" అని ప్రచారం చేయడం అతిశయోక్తి అని, తప్పుడు కోణంలో చూపించడమే అవుతుందని తెలిపింది. ఒక టీవీ ఛానెల్లో మరీ బాధ్యత లేకుండా శాఖమూరు రిజర్వాయర్ విజువల్స్ వేసి ''అమరావతి మునిగిపోయింది'' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించింది. మరొక ఛానెల్లో డ్రైనేజి, డక్టింగ్ పనుల గుంతలను, వాటిలో చేరిన నీటిని చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఛానెళ్లు చూపిన తప్పుడు వీడియోలను మరి కొందరు సోషల్ మీడియా హ్యాండల్స్ లో షేర్ చేసుకుంటున్నారని తెలిపింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదని, ఈ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+