ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల.. యాక్షన్‌తో అదరగొట్టిన కొత్త హీరో!
Itlu Arjuna Trailer: యువ హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న నూతన సినిమా 'ఇట్లు అర్జున'. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను 'వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మించారు.కింగ్ నాగార్జున సమర్పిస్తున్న ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లల ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ టైగ్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆసక్తికరంగా సాగిన ట్రైలర్.. రూ.1000 కోట్ల డీల్ చుట్టూ కథ!
పోలీస్ ఆపరేషన్ దృశ్యాలతో ట్రైలర్ ఎంతో ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. ఓ దొంగను పట్టుకోవడానికి పోలీసులు జరిపే విచారణ ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ సినిమాలో కథానాయకుడు 'అర్జున్' మాటలు మాట్లాడలేని మూగ వ్యక్తి. కానీ పరిస్థితులను అర్థం చేసుకునే అతని మేధస్సు, చురుకుదనం అతని పాత్రను చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. అర్జున్, కీర్తిల జీవితాల్లోకి ఓ క్లిష్టమైన పరిస్థితి ఎదురు కావడంతో కథ మలుపు తిరుగుతుంది. వీరిద్దరినీ ఓ వైపు పోలీసులు మరోవైపు రౌడీ ముఠా వెంటాడటం ట్రైలర్లో ఉత్కంఠను పెంచుతుంది. ఓ రహస్యమైన పెన్ డ్రైవ్, రూ.1,000 కోట్ల డీల్ చుట్టూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్ సూచిస్తోంది.

నటనతో మెప్పించిన అనీష్.. అలరిస్తున్న తమన్ మ్యూజిక్
డైరెక్టర్ మహేష్ ఉప్పాల రొమాన్స్, కామెడీ, యాక్షన్ అంశాలను చక్కగా మేళవించి ఈ సినిమాను తెరకెక్కించారు. మాటలు లేని పాత్రలో అనీష్ తన హావభావాలు, అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్ సీన్లలోనూ ఆయన శిక్షణ పొందిన తీరు కనిపిస్తోంది. కథానాయికగా అనస్వర రాజన్ అనీష్‌తో కలిసి కీలక పాత్రలో నటించింది.
ఈ చిత్రానికి రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రొమాంటిక్ ట్రాక్స్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.














Click it and Unblock the Notifications
