కాంగ్రెస్‌వారు దూరి రెచ్చగొట్టడం వల్లనే: సునీత
అనంతపురం/హైదరాబాద్: తమ కార్యకర్తల్లోకి కాంగ్రెస్‌వారు దూరి రెచ్చగొట్టి విధ్వంసానికి కారణమయ్యారని తెలుగుదేశం పార్టీ పెనుకొండ అభ్యర్థి పరిటాల సునీత ఆరోపించారు. తమ కార్యకర్తలు ఎంతగా సంయమనం పాటించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. మొదటి నుంచి పోలీసులు తమ పట్ల దుందుడుకుగానే వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు.
దుర్ఘటనకు కారణమయ్యారంటూ అనంతపురం పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) ప్రవీణ్‌కుమార్ తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు లేకుండా మీరే చేసుకుంటారా, ఎయస్‌ఐ మృతికి ఏం సమాధానం చెప్తారని ఆయన తెలుగుదేశం నాయకులను ప్రశ్నించారు.
జరిగిన సంఘటన గురించి కలెక్టర్ ఎన్నికల కమీషనర్‌కు తెలియజేశారు. పెనుకొండ సంఘటనపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో ఎన్నికల కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో రావడం వల్లనే అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకుందని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్ జిత్ సేన్ హైదరాబాద్‌లో అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం వల్ల పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అనంతరం ఆయన హోం మంత్రి కె. జానారెడ్డితో కలిసి అనంతపురం బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications
