అనంతపురం జిల్లాలో మావోయిస్టు హతం
అనంతపురం: అనంతపురం జిల్లా కాట్నేకాలువ వద్ద పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పులో ఒక మావోయిస్టు నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్‌ను దివాకర్‌గా గుర్తించారు. మరణించిన నక్సలైట్ దివాకర్ తెలుగు యువత నాయకుడు, హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమీషనర్ ఎ.కె. ఖాన్ బావమరిది నవానుల్లాను హత్య చేసినవారిలో ఒకరని భావిస్తున్నారు. నవానుల్లాను మావోయిస్టు నక్సలైట్లు ఆదివారం రాత్రి హత్య చేశారు.
నవానుల్లా హంతకుల కోసం గాలిస్తుండగా కాట్పేపల్లి వద్ద మావోయిస్టులు తారసపడ్డారని, పోలీసులను చూసి వారు కాల్పులు ప్రారంభించారని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, ఈ సంఘటనలో దివాకర్ మరణించాడని పోలీసు అధికారులు చెప్పారు. ఐదుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెబుతున్నారు. ఒక మహిళా నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్లు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు కిట్ బ్యాగ్‌లు, మందుపాతరలు, కెమెరా ఫ్లాష్‌లు, బాంబులు, తపంచా, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
