తెలంగాణ రాదు: నాగం జనార్దన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రాదని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. అరు నెలల్లో తెలంగాణ వస్తుందని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె. చంద్రశేఖర్ రావు, నరేంద్రలు ఇప్పటి వరకు ఏమీ సాధించలేకపోయారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద టి ఆర్‌యస్ నాయకులు తాకట్టు పెట్టారని ఆయన అన్నారు.
తెలంగాణపై అయోమయం నెలకొనడానికి కాంగ్రెస్ కారణమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ఎప్పుడు వస్తుందో చెప్పలేని స్థితిలో టి ఆర్‌యస్ నాయకులు కె. చంద్రశేఖర్ రావు, నరేంద్రలు ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
