యస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం: వైయస్
కర్నూలు: షెడ్యూల్డ్ కులాల (యస్సీ) రిజర్వేషన్ల వర్గీకరణకు గతంలో తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అర్హులైన పేదలందరికీ 45 రోజులలోగా రేషన్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన ఆదివారంనాడు పర్యటించారు. రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నంద్యాలకు 24 గంటలు మంచినీరు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నాలుగేళ్లల్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. అయితే పన్నులను తగ్గించడానికి వీలు కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
