వెలిగొండ ప్రాజెక్టుపై చర్చలో తిట్లపురాణం
ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టుపై బహిరంగ చర్చ పరస్పర వ్యక్తిగత దూషణలతో కొనసాగింది. తెలుగుదేశం ప్రతినిధి సానా మారుతి, ప్రభుత్వ సాగునీటి సలహాదారు సీతాపతిరావు తిట్ల పురాణం విప్పుకున్నారు. నువ్వు కోతిలా చిందులు వేస్తున్నావు అని సానా మారుతి అంటే నువ్వు కొండముచ్చులా వ్యవహరిస్తున్నావు అని సీతాపతి రావు అన్నారు. నికర జలాలను లేనప్పుడు వెలిగొండ ప్రాజెక్టుకు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని సానా మారుతి ప్రశ్నించారు. ఒక టన్నెల్ మాత్రమేనని చెప్పి రెండు టన్నెల్స్ ఎందుకు చేపడుతున్నారని కూడా ఆయన అడిగారు.
వెలిగొండ రెండో దశకు కేంద్ర జలవనరుల సంఘం (సి.డబ్ల్యు.సి.) అనుమతి ఉందా అని సానా మారుతి అడిగితే అనుమతి తెస్తామని సీతాపతి రావు జవాబిచ్చారు. కాంగ్రెస్ ప్రతినిధులు సుబాహు, మారీచుల్లా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతినిధి ప్రభాకర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
