తెలంగాణపై వచ్చే నెలలో ప్రణబ్ నిర్ణయం: జయశంకర్
హైదరాబాద్: తెలంగాణపై ఏర్పాటయిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ తన నివేదికను వచ్చే నెలలో ప్రభుత్వానికి సమర్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) సిద్ధాంతకర్త, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు. వచ్చే నెలలో తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీ నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక కీలకమైన దశకు చేరుకుందని, ఈ దశలో పదవులకు రాజీనామాలను చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను నక్సల్స్ డిమాండ్ చేయడం సరి కాదని ఆయన అన్నారు. తనకు తెలిసినంత వరకు పదవులను వదులుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వెనుకాడబోరని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తనకు ఉందని, ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను ఆందోళనకు గురి చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఒక వేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు విఫలమైతే ఉద్యమం ఎలా ఉండాలనేదానిపై మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
