హైదరాబాద్‌కుజలగండం
హైదరాబాద్:భారీవర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలుజలమయమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శుక్రవారం నుంచికురుస్తున్న వర్షం శనివారం ధారాపాతంగామారడంతో లోతట్టుప్రాంతాలు నీళ్ళలో తేలియాడుతున్నాయి.ఆరు సెంటీమీటర్ల వర్షం నమోదుకావడంతో డ్రైనేజి వ్యవస్ధ లోపభూయిష్టంగా ఉన్ననగరంలో రోడ్లు జలమయమయ్యాయి. ఖైరతాబాద్,అమీర్‌పేట రోడ్ల మీద రెండు మూడుఅడుగుల మేరకు నీరు నిలిచింది. దీనివల్ల ట్రాఫిక్‌సమస్యలు కూడా ఏర్పడ్డాయి. లోతట్టుకాలనీల నుంచి నీరు తోడడానికి ఫైర్ ఇంజిన్లసహాయం కోరామని హైదరాబాద్ నగర మేయర్‌తీగల కృష్ణారెడ్డి చెప్పారు. నగరంలో మరో ఇరవైనాలుగు గంటల సేపు వర్షాలు ఇదే విధంగాకురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications