కాంగ్రెస్‌లో చేరేప్రసక్తి లేదు: మంత్రి సంతోష్‌రెడ్డి
హైదరాబాద్:తాను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదని,ఎప్పటికీ తాను తెలంగాణ వాదినేననిరాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎస్ సంతోష్‌రెడ్డి చెప్పారు. మిగితా టిఆర్‌ఎస్ మంత్రులతోపాటు తాను రాజీనామా చేయకపోవడంతో తాను కాంగ్రెస్‌లోచేరుతున్నట్టు వదంతులు వచ్చాయని,అవన్నీ ఆధార రహితమని ఆయనతెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోలేనప్పుడు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నప్పుడు రవాణామంత్రిగా ఉన్న తాను రాజీనామా చేయడంసమంజసం కాదని తాను భావించానని అందువల్లనే రాజీనామాచేయలేదని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఢిల్లీ వెళ్ళి టిఆర్‌ఎస్‌అధినేత చంద్రశేఖరరావుకువివరించానని, ఆయన తన వివరణతోసంతృప్తి చెందారని సంతోష్ రెడ్డిపేర్కొన్నారు.












Click it and Unblock the Notifications