మా నేతలను కోర్టులో ప్రవేశపెట్టండి: చంద్రన్న
హైదరాబాద్: తమ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రభాకర్‌తో పాటు మరో ముగ్గురిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని సిపిఐ (యంయల్) జనశక్తి ప్రతినిధి చంద్రన్న డిమాండ్ చేశారు. ప్రభాకర్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రియాజ్‌ను ఇదే విధంగా హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఎన్‌కౌంటర్ చేశారని, రియాజ్‌ను మాదిరిగానే ఆ నలుగురిని ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని ఆయ అన్నారు.
ప్రభాకర్‌ను, ప్రగతిశీల విద్యార్థి సంఘం (పిడియస్‌యు) రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజును, రైతుకూలీ సంఘం నాయకుడు రాజయ్యను, జనశక్తి నక్సలైట్ క్రాంతిని పోలీసులు విజయవాడ బస్ స్టాండ్‌లో అరెస్టు చేశారని ఆయన చెప్పారు. నాగరాజు, రాజయ్యలు చట్టపరిధిలో పని చేస్తున్నవారేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
