వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

గ్రామీణాభివృద్ధికికొత్తపథకం భారత్ నిర్మాణ్
హైదరాబాద్:గ్రామీణ పేదరిక నిర్మూలనకు భారత్‌నిర్మాణ్ అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. మెదక్ జిల్లాలోరాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోవిడత భూ పంపిణీ కార్యక్రమంలోపాల్గొన్న ప్రధాని అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.అవినీతి నిర్మూలనలో, అభివృద్ధి పథకాల అమలులోప్రజల భాగస్వామ్యం ఉండాలని ఆయనకోరారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వంచేస్తున్న కృషిని ఆయన అభినందించారు.మెదక్ పర్యటనలో భాగంగా ఆయనరాజీవ్ ఇంటర్నెట్ విలేజిని ప్రారంభించారు.రాష్ట్రంలో ప్రస్తుతం 8 జిల్లాల్లో అమలులోఉన్న పనికి ఆహారం పథకాన్ని మరికోన్నిజిల్లాలకు విస్తరించాలని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి కోరగా అందుకు ప్రధానిఅంగీకరించారు.
Comments
Story first published: Sunday, August 21, 2005, 23:53 [IST]