తెలంగాణకుపాతికవేల కోట్లు: ప్రధానిని కోరిన సిఎం
హైదరాబాద్:వెనుకబడిన తెలంగాణ ప్రాంతంసస్యశ్యామలం కావడానికి అవసరమైన ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రత్యేకంగా25వేల కోట్ల రూపాయల సాయం అందించాలని ముఖ్యమంత్రిడాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ను కోరారు.మలి విడత భూ పంపిణీ కార్యక్రమంకోసం ఆదివారం నాడు మెదక్ పట్టణంలో ప్రధానిపాల్గొన్న సభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రసమగ్ర అభివద్ధి కోసం 46 వేల కోట్ల రూపాయల వ్యయంతో సాగునీటి ప్రాజెక్ట్‌లు చేపట్టామన్నారు.వీటికి అదనంగా కేంద్రం 25వేల కోట్ల రూపాయల సాయమందిస్తే తెలంగాణలో ప్రాజెక్ట్‌లు నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం అభివద్ధి చెందుతుందన్నారు.తెలంగాణలో బాగా వెనుకబడినమెదక్ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.మెదక్ జిల్లాకు గోదావరి జలాలను రప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈవిషయంమైఇంతకు ముందే తాను ప్రధానిని కోరగాతప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చారనిముఖ్యమంత్రిఅన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిఅభివద్ధికార్యక్రమం గురించి ప్రధానికి చెప్పామనిఅంటూ దేశ వ్యాప్తంగా వర్షాలు పడి ప్రాజెక్ట్‌లునిండినా సింగూరు ప్రాజెక్ట్ నిండలేదన్నారు.సింగూరు ప్రాజెక్ట్ నీటిని పూర్తిగా మెదక్‌జిల్లాకే అందించడం కోసం గోదావరి జలాలనుప్రాణహిత ద్వారా మళ్ళించాల్సినఅవసరమున్నదన్నారు.ఇందుకు కేంద్రం నుంచి ప్రత్యేకంగానిధులు మంజూరు చేయాలన్నారు. ప్రతి కుటుంబానికివంద రోజుల పని, రోజుకు 60 రూపాయలవేతనం అందించి వలసలు పోకుండా చూడడంకోసం జాతీయ ఆహార భద్రత పథకం కిందదేశవ్యాప్తంగా ఎంపిక చేయనున్న 200 జిల్లాల్లోరాష్ట్రం నుంచి మరికొన్ని జిల్లాలను గుర్తించనున్నారన్నారు.












Click it and Unblock the Notifications
