కడప జిల్లాలో కాంగ్రెస్ అడ్డదారులు: టిడిపి
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారంనాడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేవారు. విజయరామారావు, తదితర తెలుగుదేశం నాయకులు ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి ఎ.వి.యస్. రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
పులివెందులలో కాంగ్రెస్ నాయకులు తమ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. మొదటిసారి పులివెందులలో పోటీ చేసే ప్రజాస్వామిక వాతావరణం నెలకొందని, కాంగ్రెస్ బెదిరింపులను అడ్డుకోవడం ద్వారా ఆ వాతావరనం కొనసాగేలా చూడాలని వారన్నారు. పులివెందుల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కడన జిల్లాలోని మున్సిపాలిటీల్లో విజయానికి కాంగ్రెస్ అన్ని అడ్డదారులూ తొక్కుతోందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయాందోళనలకు గురి చేస్తోందని వారు ఆరోపించారు. నర్సారావుపేట డియస్పీని బాధ్యతల నుంచి తప్పించినా తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తూనే ఉన్నారని వారు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications
