సకాలంలో వరద కాలువ పనులు పూర్తి: వైయస్
కరీంనగర్: శ్రీరాంసాగర్ వరదకాలువ పనులను సకాలంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కురిత్యాల వద్ద ఆయన ఆదివారంనాడు ప్రాజెక్టు పనులను సమీక్షించారు. బ్లాస్టింగ్ వ్యవహారంలో ప్రజలకు ఇబ్బందులు జరగుకుండా చూస్తామని ఆయన చెప్పారు. నష్టపరిహారం చెల్లింపులో కూడా అక్రమాలు జరగకుండా చూస్తామని ఆయన చెప్పారు. ఈ విషయాలపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో వీటి పరిశీలనకు ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
శ్రీపాదరావు ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అధికారులకు, కాంట్రాక్టర్లకు మధ్య సమన్వయం కుదరకపోవడం వల్లనే పనుల్లో అంతరాయం జరుగుతోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
