అసెంబ్లీ: కడప జిల్లాకు కృష్ణా తరలింపుపై రభస
హైదరాబాద్: ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఉత్తర్వుకూ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. రాయలసీమలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 40 వేల క్యూసెక్కుల కృష్ణా నీటిని తరలిస్తూ జారీ ఉత్తర్వుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదనే ప్రతిపక్షాల వ్యాఖ్యపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ విధంగా ప్రతిస్పందించారు.
ప్రతి ఉత్తర్వుకు అఖిల పక్ష సమావేశంలో చర్చించాలంటే ప్రభుత్వం నడవదని ఆయన అన్నారు. జీవో విషయంలో తప్పు జరిగిందని అనుకుంటే ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు నీటిని తరలించే జీవోను ఉపసంహరించుకుంటారా అని అడిగితే శాసనసభలో చర్చకు అనుమతించాం కదా, చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications