ఆర్టీసి సమ్మెపై పంతాలకు పోవద్దు: చంద్రబాబు
హైదరాబాద్: పంతాలకు వెళ్లకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఆర్టీసి కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలకుండా చూడాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇరు వర్గాలకు సూచించారు. సమస్య పరిష్కారం విషయంలో ఇరు పక్షాలు పట్టువిడుపులతో వ్యవహరించడం మంచిదని ఆయన అన్నారు.
ఆర్టీసిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్టీసిని ప్రైవేటీకరించాలని ఎప్పుడు ప్రయత్నించలేదని ఆయన అన్నారు. ఆర్టీసిని క్రమబద్దీకరించి, మెరుగుపరచడానికి మాత్రమే ప్రయత్నించామని ఆయన చెప్పారు. స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టడానికి తమ పార్టీ స్థానిక నాయకులకే అధికారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సహకార సంఘాల ఎన్నికల విషయంలో స్థానిక నాయకులే నిర్ణయాలు తీసుకుంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
