భూకంప పీడితులకు ఎపి రూ. 2 కోట్లు: సియం
హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ భూకంప పీడితులకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భూకంపంలో మరణించినవారి కుటుంబాలకు ఆయన మంగళవారం సానుభూతి తెలియజేశారు. భూకంప తీవ్రత నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆశించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు భూకంప తీవ్రత నుంచి బయటపడి త్వరగా సాధారణ జీవితానికి రాగలరవి ఆయన ఆశించారు. భూకంప పీడితులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications
