పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచవచ్చు: సిపిఐ
విశాఖపట్నం: రాయలసీమలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచినా తమకు అభ్యంతరం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌పై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
పోతిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్‌కు కృష్ణానది నికర జలాలను కాకుండా మిగులు జలాలనే తరలిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. గోదావరినదిపై తలపెట్టిన పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసితుల డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
