2005-06 ఆర్ధికాభివృద్ధి రేటు 8.1 శాతం
హైదరాబాద్: మనదేశ స్ధూల ఆర్ధికాభివృద్ధి రేటు 8.1 శాతం ఉంటుందని 2005-06 ఆర్ధిక సర్వే వెల్లడించింది. పన్నులు, కార్మిక సంక్షేమ రంగాల్లో సంస్కరణలను వేగంగా అమలు చేయాలని ఆర్ధిక సర్వే సూచించింది. యూజర్ చార్జీలను పెంచాలని, అనవసర సబ్సిడీలను తగ్గించాలని సూచించిన తాజా ఆర్ధిక సర్వే నివేదికను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పారిశ్రామిక రంగంలో పునరుజ్జీవం కారణంగా 2005-06లో ఆర్ధికాభివృద్ధి రేటు 8.1 శాతం ఉండగలదని పేర్కొన్నారు. ఆర్ధికాభివృద్ధికి విద్యుత్ కొరత ప్రధాన అవరోధంగా ఉందని సూచించారు.












Click it and Unblock the Notifications