అక్కినేని కమర్షియల్ కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు వాణిజ్య సముదాయానికి బాంబు బెదిరింపు వచ్చింది. బంజారాహిల్స్‌లోని ఎఎన్‌ఆర్ సెంటర్‌లో బాంబు ఉందంటూ ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అయితే రెండు గంటలకు గానీ బాంబు స్క్వాడ్స్ రాలేదు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో ఉత్తుత్తి బాంబు బెదిరింపుల గోల పెరగడంతో బాంబు స్క్వాడ్స్ పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. బాంబు స్క్వాడ్స్ వచ్చిన వెంటనే అందరినీ బయటకు పంపేసి తనిఖీలు నిర్వహించారు. బాంబు పెట్టినట్లు వచ్చిన సమాచారం ఉత్తుత్తిదేనని తేలిపోయింది.












Click it and Unblock the Notifications