పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటాం: రాఘవులు
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయకపోతే తామే అడ్డుకుంటామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. చలో పోలవరం ప్రాజెక్టు కార్యక్రమాన్ని చేపడతామని ఆయన చెప్పారు. పోలవరం పనులు ఆపకపోతే తామే అడ్డుకుంటామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎక్కువగా గిరిజనులు భూములు కోల్పోతున్నారని ఆయన అన్నారు. తాము ప్రత్యామ్నాయాలు చూపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
అభివృద్ధి పేరుతో ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 24వ తేదీన ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో బాక్సైట్ గనుల తవ్వకాలను నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఇప్పటికీ ఎత్తివేయకపోవడం సిగ్గు చేటు అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
