స్పీకర్ అంగీకరిస్తే ఫైళ్లు సభ ముందు పెడతాం: జెసి
హైదరాబాద్: స్పీకర్ అంగీకరిస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను సభ ముందు పెట్టడానికి తాము సిద్ధమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. స్పీకర్ మీద గౌరవంతోనే ఫైళ్లను సభ ముందు కాకుండా, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వద్ద పరిశీలనకు ఉంచాలని నిర్ణయించుకున్నామని ఆయన బుధవారం శాసనసభలో చెప్పారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు అంచనాల్లో ఏ విధమైన అక్రమాలు జరగలేదని ఆయన అన్నారు. స్పీకర్ మీద గౌవరంతోనే ఫైళ్లను చూపాలని నిర్ణయించుకున్నామని కూడా ఆయన చెప్పారు. ఫైళ్లలో ఏవో రహస్యాలున్నందుననే తాము చూపడం లేదనే అభిప్రాయంలో నిజం లేదని ఆయన అన్నారు. ఫైళ్లలో రహస్యాలేమీ లేవని, వాటిని దాచి పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
