రాహుల్ డ్రగ్స్ తీసుకున్నారు: అపోలో వైద్యులు
న్యూఢిల్లీ: అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన దివంగత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ కొకైన్, డ్రగ్స్ తీసుకున్నట్లు మూత్ర పరీక్షల్లో తేలిందని ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే రాహుల్ మాదక ద్రవ్యాలు తీసుకోలేదని పరీక్షల్లో తేలిందని శనివారంనాడు తాను చెప్పిన విషయానికి కట్టుబడి ఉన్నట్లు డాక్టర్ అనుపమ్ సిబాల్ అంటున్నారు. రాహుల్ డ్రగ్స్ తీసుకున్నారా అని అడిగితే బహుశా అవును, బహుశా కాదు అని సిబాల్ సమాధానమిచ్చారు. అతి కొద్దిగా డ్రగ్స్ తీసుకున్నా మూత్ర పరీక్షలో వాటిని తీసుకున్నట్లు ఫలితం వస్తుందని ఆయన అన్నారు. రాహుల్ ఆల్కహాల్ సేవించినట్లు రక్త పరీక్షలో తేలింది.
రాహుల్ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగు పడిందని, రాహుల్ ఆహారం తీసుకుంటున్నారని అపోలో వైద్యులు చెప్పారు. స్పృహలోకి రావడంతో రాహుల్‌ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఇదిలావుంటే, ప్రమోద్ మహాజన్ వ్యక్తిగత కార్యదర్శి వివేక్ మొయిత్రా అధిక మోతాదులో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.












Click it and Unblock the Notifications
