సచిన్ చేరిక ఆనందదాయకం: ద్రావిడ్
హైదరాబాద్: జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేరిక సంతోషం కలిగిస్తోందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళవారంనాడు హైదరాబాద్ వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌లో తమ జట్టు రాణిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వన్డేల్లో భారత జట్టు పటిష్టమైందని ఆయన అన్నారు. వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌లో ఓటమి శ్రీలంక పర్యటనలో ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌కు తాము ఉత్కంఠతో ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీలంక సరీస్‌లో తాము పూర్తి ప్రతిభ కనబరుస్తామని ద్రావిడ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
