సమ్మెతో బ్యాంకు లావాదేవీల స్తంభన
న్యూఢిల్లీ: ఉద్యోగుల సమ్మెతో శుక్రవారంనాడు బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకుల లావాదేవీలు దాదాపు పూర్తిగా స్తంభించాయి. తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు, కొన్ని విదేశీ బ్యాంకుల ఉద్యోగులు ఒక రోజు సమ్మెకు దిగారు.
తొమ్మిది సంఘాలతో కూడిన బ్యాంకు సంఘాల ఐక్య వేదిక ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ బ్యాంకులన్నీ మూతపడ్డాయి. హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించాయి. విధులను బహిష్కరించి ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించకపోవడం వల్ల తమపై పనిభారం పెరిగిందని వారు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications
