వైజాగ్: కిడ్నాపైన బ్యాంక్ మేనేజర్ హత్య
విశాఖపట్నం: వైజాగ్ లో కిడ్నాపైన బ్యాంక్ మేనేజర్ హత్యకు గురయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విశాఖపట్నం ద్వారకానగర్ బ్రాంచ్ మేనేజర్ కెకె ప్రసాద్ ను దుండగులు గురువారం కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.
బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ మృతదేహం శనివారం ఉదయం సాంగివలస వద్ద రోడ్డుపై లభ్యమైంది. ప్రసాద్ ను పెట్రోల్ పోసి కాల్చి చంపారు. బిల్డర్ ల నుంచి బకాయిలను వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించి ఆస్తులను జప్తు చేసినందుకు వారు కక్షగట్టి ఆయనను చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆయన కుటుంబసభ్యులు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
