ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరి మృతి
తుని: ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఈ బస్సు ఎర్రకోనేరు ప్రాంతంలో వెలుతుండగా, అదుపుతప్పు రోడ్డు పక్కన ఉన్న లోయలో పడింది.
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇరువురు వ్యక్తులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులో సుమారు 80 మంది ప్రయాణీకులు ఉన్నారని వారు వివరించారు.
ప్రమాదం సంభవించిన వెంటనే పలువురు స్థానికులు సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications
