పరిటాల హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా
అనంతపురం: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసు విచారణ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. నిందితులందరూ హాజరు కాకపోవడంతో కేసు విచారణను కోర్టు మంగళవారంనాడు తిరిగి వాయిదా వేసింది. ఆనారోగ్య కారణాల వల్ల వడ్డే శీను అనే నిందితుడు కోర్టుకు హాజరు కాలేదు.
ఈ కేసు విచారణ ఇప్పటి వరకు 30 సార్లు వాయిదా పడింది. ఈ కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి, మొద్ద శీను, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి వంటివారు నిందితులుగా ఉన్నారు. మద్దెలచెర్వు సూరికి, మొద్దు శీనుకు మధ్య విభేదాలు పొడసూపాయనే వార్తలు కూడా ఇటీవలి కాలంలో వెలువడ్డాయి.












Click it and Unblock the Notifications