అడవి ఏనుగులకు భయపడిన ఏనుగు పరారీ
విజయనగరం: శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల పాలిటి శాపంగా పరిణమించిన అడవి ఏనుగులను అదుపు చేయడానికి చేపట్టిన ఆపరేషన్ గజేంద్ర కార్యక్రమం అనేక అడ్డంకుల మధ్య కొనసాగుతోంది. అడవి ఏనుగులను చూసి చిత్తూరు నుంచి రప్పించిన మచ్చిక ఏనుగు పారిపోతోంది. అడవి ఏనుగుల బెడదను తొలగించడానికి ఈ ఏనుగును రప్పించారు.
ఇదిలావుంటే, అస్సాం నుంచి వచ్చిన విజయేంద్ర చౌదరి అడవి ఏనుగులను పట్టుకోవడానికి తన పని మొదలు పెట్టారు. మత్తు రైఫిళ్లను అడవి ఏనుగులకు గురి పెట్టి కాల్చారు. దాంతో రెండు ఏనుగులు మత్తుతో పడిపోయాయి. వాటిని తాళ్లతో బంధించారు. అయితే మత్తు వదిలే లోగానే వాటిని తరలించడానికి తగిన సిబ్బంది అందుబాటులో లేరు. ఈ హడావిడికి మిగతా ఏనుగులు పారిపోయాయి. ఏనుగుల దాడిలో రాష్ట్రంలో ఇప్పటి వరకు పది మంది మరణించారు.












Click it and Unblock the Notifications