చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మరణించాడు. అతని పేరు సంజీవ. రంగారెడ్డి జిల్లా బాచుపల్లికి చెందిన సంజీవ ఒక దొంగతనం కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 15 రోజుల క్రితమే అతను చర్లపల్లి జైలుకు వచ్చాడు.
అనారోగ్యంతో బాధ పడుతున్న సంజీవను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యం సరిగా అందకపోవడంలో వల్లనే మరణించాడని సంజీవ బంధువులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications
