తెలంగాణ రచయితల వేదికకు కొత్త నాయకత్వం
కరీంనగర్: తెలంగాణ రచయితల వేదిక (తెరవే) నాయకత్వం మారింది. కరీంనగర్ లో జరిగిన వేదిక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రముఖ కవి జూకంటి జగన్నాథం ఎన్నికయ్యారు. కార్యవర్గ వివరాలను నూతన అధ్యక్షుడు జూకంటి జగన్నాథం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రధాన కార్యదర్శిగా మరో ప్రముఖ కవి జూలూరి గౌరీశంకర్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా దుర్గాబాయి ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా ఎం. మల్లయ్య, గోపు లింగారెడ్డి, అనిశెట్టి రజిత, తుర్లపాటి లక్ష్మి, శ్రీధర్ దేశ్ పాండే, కార్యదర్శులుగా అన్నవరం దేవేందర్, బుర్రా తిరుపతి, రామలక్ష్మి, పొట్లపల్లి శ్రీనివాసరావు, దశకుర్తి శ్యామల ఎన్నికైనట్లు జూకంటి జగన్నాథం తెలిపారు. ప్రవాస తెలంగాణ సాహిత్య సంస్థలను కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
