గల్ఫ్ బాధిత దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సడిపల్లి గ్రామంలో గల్ఫ్ బాధితులైన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గల్ఫ్ కు వెళ్లిన పెద్ద గంగారాం ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాడు. విజిటింగ్ వీసాపై వెళ్లిన గంగారాం తగినంత సంపాదించలేకపోయాడు. ఊళ్లో అప్పులు పేరుకుపోయాయి.
అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో భార్యతో కలిసి గంగారాం ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి 2 లక్షల రూపాయల అప్పు పేరుకుపోయింది. వారి మృతితో మూడేళ్ల కూతురు అనాథగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications
