మహాలక్ష్మి కేసు: సత్యనారాయణ అరెస్టు
విజయవాడ: ల్యాబ్ టెక్నీషయన్ కోర్సు చదువుతున్న మహాలక్ష్మి ఆత్మహత్య కారణమని ఆరోపణలు ఎదుర్కుంటున్న యువకుడు సత్యనారాయణను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతన్ని పోలీసులు నల్లగొండ జిల్లా కోదాడలో అరెస్టు చేసి గుడివాడకు తీసుకొచ్చారు. సత్యనారాయణ వేధించడం వల్లనే తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని మహాలక్ష్మి తన మరణవాంగ్మూలంలో తెలియజేసింది.
ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహాలక్ష్మి ప్రస్తుతం గుడివాడలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాలిన గాయాలతో ఆమె ఆదివారంనాడు ఆస్పత్రిలో చేరింది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని సత్యనారాయణ బెదిరించాడని, ఆందోళనకు గురై తాను ఆత్మహత్యకు యత్నించానని ఆమె చెప్పింది. సత్యనారాయణ ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications
