ఆటోలకు డిజిటల్ మీటర్లు బిగించాల్సిందే: కన్నా
హైదరాబాద్: డిజిటల్ మీటర్లపై ప్రభుత్వానికి, ఆటో సంఘాలకు మధ్య బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆటోలకు డిజిటల్ మీటర్లు బిగించుకోవాల్సిందేనని రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. అయితే అందుకు గడువును మాత్రం పొడిగిస్తున్నట్లు చెప్పారు.
వచ్చే ఏడాది. జనవరి ఒకటవ తేదీ వరకు ఆటోలకు డిజిటల్ మీటర్లు బిగించుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు ఆటోలపై దాడులు జరగబోవని ఆయన చెప్పారు. డిజిటల్ మీటర్లు బిగించుకోవాలనే ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా హైదరాబాద్, సికింద్రాబాదుల్లోని ఆటో డ్రైవర్లు ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
