అరాచాకాన్ని అనుమంతిలేం: ముఖ్యమంత్రి


Rajasekhar Reddyహైదరాబాద్: శాసనసభా సమావేశాల నిర్వహణ విషయంలో అరాచాకాన్ని అనుమతించలేమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. తెలుగుదేశం తీరుపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. సభలో అవకాశం అడిగినప్పుడు ఒకరికి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు అదే పద్ధతిని అనుసరిస్తారని, దాని వల్ల అరాచకస్థితి నెలకొంటుందని ఆయన అన్నారు. శాసనసభ ఎజెండా ప్రకారం నడవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ప్రచారం కోసం సస్పండ్ కావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎక్కడా అమలు కాని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని, సభ సజావుగా జరిగితే తమ డొల్లతనం బయటపడుతుందని తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. సభ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. తాను తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి ఏ మాత్రం వెనకాడబోనని, అయితే తాను ఏ విధమైన తప్పూ చేయలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+