జర్నలిస్టులు మినహాయింపు కారు: వైయస్
కడప: చట్టం ఎవరికైనా ఒక్కటేనని, జర్నలిస్టులు దానికి మినహాయింపు కారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు జర్నలిస్టుల అరెస్టుకు నిరసనగా గురువారం జర్నలిస్టులు ముఖ్యమంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జర్నలిస్టులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో ఆయన ఆ విధంగా ఉన్నారు. జర్నలిస్టుల అరెస్టు సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించనున్నట్లు ఆయన తెలిపారు.
జర్నలిస్టుల అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తిరుపతి, గుంటూరుల్లో ర్యాలీలు జరిగాయి. కర్నూలులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రతిపక్షాల నాయకులు ధర్నా చేశారు. అనంతపురం జిల్లాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వరంగల్, నల్లగొండల్లో కూడా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications
