బెనజీర్ భుట్టోకు మళ్లీ గృహ నిర్బంధం


Benazir Bhuttoఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షురాలు బెనజీర్ భుట్టోకు ఆ దేశ పోలీసులు మళ్లీ గృహ నిర్బంధం విధించారు. ఇటీవల ర్యాలీ సందర్భంగా తొలిసారి గృహ నిర్భంధానికి గురైన భుట్టో అనంతరం మళ్లీ ఎమర్జెన్సీ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎమర్జెన్సీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌కు పీపీపీ చేపట్టిన భారీ ర్యాలీలో భుట్టో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను ర్యాలీలో పాల్గొనకుండా చేసేందుకు పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దాదాపుగా వారం రోజుల పాటు ఆమె గృహ నిర్భంధం కొనసాగుతుందని పాక్ పోలీసులు చెప్పారు. సోమవారం రాత్రి నుంచి భద్రతా దళాలు భుట్టో ఇంటిని చుట్టుముట్టాయి. ఆమెను బయటకు రాకుండా చేశాయి. దేశంలో ఎమర్జెన్సీపై చేస్తున్న తమ ఆందోళన కొనసాగుతుందని, తాము చేపట్టిన ర్యాలీ కూడా ఆగదని పిపిపి ప్రతినిధి ఫజానా రాజా స్పష్టం చేశారు. గృహ నిర్భంధం నుంచి బయటకు రావడానికి భుట్టో తప్పకుండా ప్రయత్నిస్తారని ఆయన నమకం వ్యక్తం చేశారు.

తమ ఆందోళనను అణిచివేయడానికి ప్రయత్నిస్తే పంజాబ్‌లో యుద్ధ వాతావణం నెలకొంటుందని హెచ్చరించారు. ఓ వైపు ఈనెల 22లోగా అత్యవసర పరిస్థితి ఎత్తివేయకపోతే కామన్వెల్త్ నుంచి బహిష్కారించాలని కామన్వెల్త్ దేశాల సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. అయితే కామన్వెల్త్ దేశాల నిర్ణయంపై పాక్ అంసతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల మూడున ముషారఫ్ పాక్‌లో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+