గౌరవంగా భావిస్తున్నా: హీరోయిన్ చార్మి
హైదరాబాద్: మానసిక వికలాంగులైన పిల్లలతో విమానంలో ప్రయాణించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని సినీ నటి చార్మి అన్నారు. జెట్ ఎయిర్ వేస్ ఈ అవకాశాన్ని కల్పించింది. జెట్ ఎయిర్ వేస్ విమానంలో మానసిక వికలాంగులైన పిల్లలను విమానంలో తిప్పింది. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం 45 నిమిషాల పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో తిరిగింది. ఈ విమానంలో ఆ పిల్లలతో చార్మి ప్రయాణించారు.
మానసిక వికలాంగులైన పిల్లలతో గడపడం తనకు ఆనందంగా ఉందని చార్మి అన్నారు. జీవితాన్ని ఉన్నదున్నట్లుగా స్వీకరిస్తున్న ఈ పిల్లల మధ్య గడపడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ఒక స్నేహితురాలు ఫోన్ చేసి వస్తావా అని అడిగిందని, వెంటనే తాను అంగీకరించానని ఆమె చెప్పారు. సామాజిక ప్రముఖులుగా మానసిక వికలాంగులైన పిల్లలను పరిగణించి వారికి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించామని జెట్ ఎయిర్ వేస్ ఏరియా మేనేజర్ గోపాలన్ చెప్పారు.












Click it and Unblock the Notifications
