నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత
గుంటూరు: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్న నకిలీ నోట్ల కరెన్సీ ముఠాకు చెందిన ఆరుగురిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన శ్రీరాంకుమార్ ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు. వీరి నుంచి పోలీసులు 3 లక్షల 80 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
కంప్యూటర్, ప్రింటర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ నోట్ల డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్న నలుగురిని, కర్నూలు జిల్లాలో డిస్ట్రిబ్యూటరుగా వ్యవహరిస్తున్న ఒకర్ని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ చెప్పారు. గత ఆరు నెలలుగా తాము ఈ పని చేస్తున్నట్లు శ్రీరాంకుమార్ ఎస్పీ సమక్షంలో మీడియా ప్రతినిధులతో చెప్పాడు.












Click it and Unblock the Notifications
