వైయస్ వ్యతిరేకమని మా దృష్టికి రాలేదు: ఇంద్రకరణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతీయ సమన్వయ కమిటీ (టీఆర్సీసిసి) నాయకుడు, కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎ. ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తాము కలిసినప్పుడు ప్రధానిగానీ, సోనియా గాంధీ గానీ ఆ విషయం తమతో చెప్పలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారని మాజీ ఎం. సత్యనారాయణరావు చేసిన ప్రకటనపై ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని సోనియా గాంధీ చూసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణపై అధిష్ఠానవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తాము శాసనసభ సమావేశాల తర్వాత సోనియాను కలుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
