తప్పుడు వార్తలకే విలేకరులపై కేసులు: జానారెడ్డి
హైదరాబాద్: తప్పుడు వార్తలు రాసినందుకే కర్నూలు జిల్లాలోని ఇద్దరు విలేకరులపై కేసు పెట్టినట్లు హోంమంత్రి కె. జానారెడ్డి చెప్పారు. విలేకరుల అరెస్టుపై ఆయన మంగళవారం శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఆ విలేకరులు అధికారుల నుంచి ఖాళీ పత్రాలు తీసుకుని, ఉన్నత వ్యక్తుల పేర్లు రాసుకున్నారని, ఆ రకంగా వారు మోసం చేశారని ఆయన అన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.
విలేకరుల అరెస్టుపై మంగళవారం శాసనసభ దద్ధరిల్లింది. విలేకరుల అరెస్టు ప్రభుత్వ నాశనానికి దారి తీస్తుందని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. విలేకరులపై కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపుతో తప్పుడు కేసులు బనాయించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
