కెసిఆర్ ను చూసి ఓట్లేయలేదు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: కరీంనగర్ లోకసభ ఉప ఎన్నికలో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును చూసి ఓట్లు వేయలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కెసిఆర్ కు ఓటు వేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము తెలంగాణ ప్రజల అభీష్టాన్నే చెబుతున్నామని ఆయన అన్నారు. తమ తెలంగాణ తమకు కావాలని ఆయన అన్నారు.
తాను ప్రధాని పేరును వాడుకునే బాధ్యతారహితమైన వ్యక్తిని కానని ఆయన అన్నారు. ప్రధాని చెప్పిందే తాను చెప్పానని, తాను సాదాసీదాగా మాట్లాడడం లేదని ఆయన అన్నారు. అభివృద్ధే ప్రాతిపదిక అయితే కరీంనగర్ లోకసభ ఫలితం ఏమైందని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును అందరూ గౌరవించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారని ప్రధాని తనతో చెప్పినట్లు సత్యనారాయణ రావు సోమవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
