టిడిపి నేత గద్దే ఆక్వాకు రెవెన్యూ నోటీసులు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దే రామ్మోహన్ రావుకు చెందిన బాలాజీ ఆక్వాకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా పల్లెతుమ్మలపాలెంలో బాలాజీ ఆక్వా భూఆక్రమణలకు పాల్పడినట్లు రెవెన్యూ అధికారులు తమ నోటీసులో తెలియజేశారు. తమ నోటీసుకు 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు.
బాలాజీ ఆక్వా 79 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందులో 67 ఎకరాలు అసైన్డ్ భూములని, 12 ఎకరాలు ప్రభుత్వ భూములని రెవెన్యూ అధికారులు తేల్చారు. బాలాజీ ఆక్వాకు గద్దే రామ్మోహన్ రావు చైర్మన్. హైదరాబాదులో కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ భూముల వివాదంపై తీవ్ర విమర్సలు చేసిన నేపథ్యంలో గద్దే రామ్మోహన్ రావు భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications
