ఈస్ట్ మారేడుపల్లిలో వ్యాపారి కిడ్నాప్
హైదరాబాద్: సికింద్రాబాదులోని ఈస్ట్ మారేడుపల్లిలో నాగేశ్వరరావు అనే వ్యాపారి అపహరణ జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగింది. ఆగంతకులు నాగేశ్వరరావు ఇంటికి వచ్చి సుమోలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆగంతకుల ఆచూకీ కనిపెట్టేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ఫైనాన్షియర్ సాయిబాబానే నాగేశ్వరరావును కిడ్నాప్ చేశాడని నాగేశ్వరరావు బావ మరిది ఆరోపిస్తున్నాడు. సాయిబాబా తన వద్ద నాగేశ్వరరావు చిరునామా తీసుకున్నాడని ఆయన చెప్పాడు.












Click it and Unblock the Notifications
