రాహుల్ గాంధీ కిడ్నాప్ కుట్ర భగ్నం


లక్నో: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కిడ్నాప్ కుట్రను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టుతో ఆ కుట్ర విషయం తెలిసింది. ఈ ముగ్గురు కూడా జైష్ -ఎ - మహ్మద్ ఉగ్రవాదులు. ముగ్గురు కూడా పాకిస్తానుకు చెందినవారే. రాహుల్ గాంధీని కిడ్నాప్ చేసి భారతదేశంలోని జైళ్లలో ఉన్న 42 మంది తమ అనుచరులను విడిపించుకోవాలనేది జైష్ - ఎ - మొహ్మద్ తీవ్రవాదుల ఆలోచనగా భావిస్తున్నారు.

అరెస్టయిన తీవ్రవాదుల నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి ఒక ల్యాప్ టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ల్యాప్ టాప్ లో రాహుల్ పేరుతో పాటు పలువురి పేర్లన్నాయి. వారి నుంచి పోలీసులు రెండు ఎకె - 47 రైఫిళ్లు, మూడు చైనీస్ పిస్టళ్లు, 5 కిలోల ఆర్డీయెక్స్ స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులతో ఎదురుకాల్పుల అనంతరం పోలీసులు ఆ ముగ్గురు తీవ్వవాదులను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+