కూలిన శిక్షణా విమానం: ఒక పైలట్ కు గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లా చేర్యాల మండలం పడమటి కేశవాపూర్ వద్ద శిక్షణా విమానం ఒకటి కూలిపోయింది. అందులోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయట పడ్డారు. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఇద్దరు పైలట్లు ఆనందకుమార్, సయ్యద్ మాలిక్ పారాచూట్లతో కిందికి దిగారు.
కిందికి దిగే ప్రయత్నంలో మాలిక్ గాయపడ్డాడు. ఆయనను వరంగల్ జిల్లా జనగామ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. విమానం కూలిపోవడం స్థానికుల్లో సంచలనం రేకెత్తించింది. ఈ విమానం హైదరాబాద్ సమీపంలోని హకీంపేట ఎయిర్ ఫోర్సుకు చెందిందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications