ఎసిబి వలలో ఆబ్కారీ ఎస్పీ రంజిత్ కుమార్
హైదరాబాద్: మహబూబ్ నగర్ ఆబ్కారీ పోలీసు సూపరింటిండెంట్ (ఎస్సీ) రంజిత్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు చిక్కాడు. కల్లు కాంట్రాక్టర్ అర్జున్ గౌడ్ నుంచి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రంజిత్ ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. హైదరాబాదు సమీపంలోని బాలాపూర్ వద్ద కారు ఆపి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వల పన్ని అతన్ని పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కుమ్మరిగుడా, హైదరాబాదులోని మాసాబ్ ట్యాంక్ లో గల ఆయన ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకున్నందుకు రంజిత్ కుమార్ గతంలో ఒకసారి సస్పెండ్ కూడా అయ్యారు. లంచం కోసం వేధిస్తుండడంతో అర్జున్ గౌడ్ ఎసిబి అధికారులకు రంజిత్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిబి అధికారులు అతన్ని ట్టుకున్నారు.












Click it and Unblock the Notifications