వైయస్ వన్నీ అబద్ధాలే: చంద్రబాబు
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంగళవారం శాసనసభ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సభలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి వ్యవహార శైలిని ఆయన తప్పు పట్టారు.
సభలో తాము ప్రజాసమస్యలను చాలానే ప్రస్తావించామని ఆయన చెప్పారు. తప్పుడు సమాచారం ద్వారా, వాయిదాల ద్వారా ప్రభుత్వం పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. సభను వాయిదా వేయించే ఏకైక ఎజెండాతో ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రజా ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
