చిరంజీవి గ్రహదోష నివారణకు యజ్ఞాలు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి శాంతి కలగాలని కోరుతూ ఆయన అభిమానులు పలు కార్యక్రమాలు చేపట్టారు. గ్రహ దోష నివారణకు పూజలు, యజ్ఞాలు చేపట్టారు. సర్వమత ప్రార్థనలు చేశారు. అమ్మవారి కుంకుమార్చన, మహారుద్రాభిషేకం వంటి పలు పూజ కార్యక్రమాలు నిర్వర్తించారు.
నేత్రదానం, రక్తదానం కార్యక్రమాలతో పాటు శాంతి యజ్ఞం చేపట్టినట్లు అభిమానులు చెప్పారు. గ్రహ దోష నివారణ జరిగి చిరంజీవి కుటుంబానికి శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఇవన్ని నిర్వర్తిస్తున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications
